ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ జగ జ్యోతి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ నగదు ఉన్నట్లు గుర్తించిన అధికారులు రూ.64 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జ్యోతిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.
మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఆఫీస్‌లో జగజ్యోతి ఇంచార్జి సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ అధికారులు.
