ఏసీబీకి చిక్కిన బోధన్ టౌన్ ఎస్సై..రూ.7 వేలు తీసుకుంటుండగా పట్టివేత

ఏసీబీకి చిక్కిన బోధన్ టౌన్ ఎస్సై..రూ.7 వేలు తీసుకుంటుండగా పట్టివేత

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా బోధన్​ టౌన్​ ఎస్సై చిటన్నోజు భాస్కరచారి బుధవారం ఏసీబీ చిక్కాడు. ఓ బాలుడిని కేసు నుంచి తప్పించడానికి రూ.7 వేలు తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయాడు. లా అండ్​ ఆర్డర్​ సమస్య సృష్టించేలా సోషల్​ మీడియాలో రీల్స్​ చేస్తున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇందులో 16 ఏండ్ల బాలుడి ప్రమేయం ఉందంటూ అతని కుటుంబీకులకు ఎస్సై భాస్కర్​చారి సమాచారం ఇచ్చి కేసు లేకుండా చేయడానికి రూ.10 వేలు డిమాండ్​ చేశారు. బాలుడి బంధువైన మున్సిపల్​ కౌన్సిలర్​ ఏసీబీ డీఎస్పీ శేఖర్​గౌడ్​ను సంప్రదించి విషయం చెప్పారు. ఆయన సూచనల మేరకు బుధవారం రూ.7 వేలు ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఎస్సైని అరెస్ట్​ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు.