పండ్లకు లంచం.. ఏసీబీకి చిక్కిన అటవీ అధికారులు ..పరిగిలో అటవీ శాఖ అవినీతి పర్వం

పండ్లకు లంచం.. ఏసీబీకి చిక్కిన అటవీ అధికారులు ..పరిగిలో అటవీ శాఖ  అవినీతి పర్వం
  • లారీ సీతాఫలాలకు రూ.50 వేల లంచం
  • పరిగిలో అటవీ శాఖ అధికారుల అవినీతి పర్వం
  • వల పన్ని పట్టుకున్న ఏసీబీ

పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి రేంజ్​లోని అటవీ శాఖ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కుల్కచర్ల, చౌడాపూర్, దోమ మండలాల అటవీ ప్రాంతంలో సీతాఫలాలు కోసి అమ్ముకోవడానికి టెండర్​దారులు ప్రభుత్వానికి రూ.18 లక్షలు చెల్లించారు. అయితే, ప్రతి లారీకి రూ.50 వేలు లంచం ఇవ్వాలని కుల్కచర్ల మండల అటవీ శాఖ సెక్షన్ అధికారులు సాయికుమార్, మోహినుద్దీన్ తోపాటు డ్రైవర్ బాలక్రిష్ట డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించగా, శుక్రవారం వల వన్ని పట్టుకున్నారు. రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా, నిందితులను పట్టుకొని రిమాండ్​కు తరలించినట్లు  ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.