ట్రోఫీ కావాలంటే మా ఆఫీస్‌‌కు వచ్చి తీసుకోండి.. ఏసీసీ ప్రెసిడెంట్ మోహ్‌‌సిన్ నఖ్వీ

ట్రోఫీ కావాలంటే మా ఆఫీస్‌‌కు వచ్చి తీసుకోండి.. ఏసీసీ ప్రెసిడెంట్ మోహ్‌‌సిన్ నఖ్వీ

దుబాయ్: ఆసియా కప్ గెలిచిన టీమిండియాకు ట్రోఫీ  ఇంకా ఇవ్వకపోవడంపై చెలరేగిన  వివాదం కొనసాగుతోంది. ఇండియాకు ట్రోఫీ కావాలంటే దుబాయ్‌‌లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ( ఏసీసీ) హెడ్‌‌ ఆఫీస్‌‌లో తన వద్దకు వచ్చి తీసుకోవచ్చని ఏసీసీ ప్రెసిడెంట్‌‌, పాకిస్తాన్ మంత్రి మోహ్‌‌సిన్ నఖ్వీ బుధవారం రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. ట్రోఫీని ఇండియాకు అప్పగించకపోవడంతో ఏసీసీ ఏజీఎంలో బీసీసీఐ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను బీసీసీఐకి క్షమాపణ చెప్పినట్లు వచ్చిన వార్తలను నఖ్వీ ఎక్స్‌‌ వేదికగా ఖండించాడు. ‘నేను బీసీసీఐకి ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదు.  ఎప్పటికీ చెప్పను.  ఏసీసీ ప్రెసిడెంట్‌‌గా  ఆ రోజు ట్రోఫీని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. వాళ్లకు (ఇండియా)ట్రోఫీ కావాలంటే ఏసీసీ ఆఫీస్‌‌కు వచ్చి నా నుంచి తీసుకోవచ్చు’ అని పోస్ట్ చేశాడు.