
హైదరాబాద్ అప్పా జంక్షన్ సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కంటైనర్ ను కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన రాజేంద్రనగర్ పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వైజాగ్ కు చెందిన వెంకటగణపతి కాల్కె(48), జయశ్రీ(40), కుమారుడు విరాట్ కాల్కె(11), కూతురు శ్రీయకాల్కె(7), బంధువులు జి.ఎస్.కాల్కె(55)తో కలిసి విమానంలో మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడ నుంచి కారులో మహారాష్ట్ర వెళ్లేందుకు డ్రైవర్ ముస్తాఫా ఘనీషేక్(45)తో కలిసి బయలుదేరారు. అప్పా వద్దకు రాగానే ముందు వెళ్తున్న కంటైనర్‌ను వేగంగా వెనుక నుంచి ఢీకొట్టాడు. డ్రైవర్ ముస్తాఫా ఘనీషేక్‌తో పాటు జయశ్రీ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న వెంకటగణపతి కాల్కె, జీఎస్ కాల్కె, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.