
విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన తర్వాత.. మందుతాగి బైక్ నడుపుకుంటూ వెళ్తున్న టైమ్ లో యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
వైజాగ్ బీచ్ రోడ్డులో గత రాత్రి స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను జరిపారు కొందరు యువకులు. కేక్ కట్ చేయించి.. సరదాగా గడిపి ఆ తర్వాత రైడ్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు.. సెవెన్ హిల్స్ హాస్పిటల్ జంక్షన్ వద్ద రోడ్ యాక్సిడెంట్ అయింది. మద్యం మత్తులో బైక్ ను వేగంగా నడిపారు యువకులు. బైక్ కంట్రోల్ తప్పి అక్కడున్న పోల్ ను బలంగా ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్.. వినయ్ వర్మ, జెన్నీ సుధీర్ అక్కడికక్కడే చనిపోయారు.
జెన్నీ సుధీర్ అరకుకు చెందినవాడు. వినయ్ వర్మ ఊరు పెందుర్తి. ఈ ఇద్దరిలో ఒకరు PG చదువుతున్నారు. మరొకరు డిగ్రీ పూర్తి చేశారు. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేశారు. ఫ్రెండ్ పెళ్లి ఉందని ఇంట్లో చెప్పి వచ్చారనీ.. వైజాగ్ లో స్నేహితుడి బర్త్ డే వేడుకలో పాల్గొని వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.