సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ పై హిట్ అండ్ రన్

సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ పై హిట్ అండ్ రన్

మాదాపూర్​, వెలుగు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. సోమవారం సాయంత్రం సైబర్​ టవర్స్ ఫ్లైఓవర్​పై ఎన్​ఐఏ వైపు వెళ్తుండగా ఓ వ్యక్తి(38)ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర రక్తస్రావమై స్పాట్​లోనే మృతిచెందాడు. మాదాపూర్​ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుడి వివరాలు తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని  తెలిపారు.