హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. డా.బీఆర్ అంబేద్కర్ ఫ్లై ఓవర్పై అతి వేగంగా దూసుకెళ్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది బైక్. ఈ ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. పోస్ట్మార్టం కోసం బైకర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడిని ఓల్డ్ బోయిన్ పల్లికిచెందిన రోహన్ దేవ్(21) గా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చేతికి అందొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మృతుడి తల్లుదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
