అబార్షన్లకు కాలుష్యమూ కారణమే!

V6 Velugu Posted on Jan 12, 2021

దక్షిణాసియా దేశాల్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల కంటే ఎక్కువ స్థాయిలో కాలుష్యం ఉన్నట్లు తేలింది. ఇండియా, పాకిస్తాన్‌‌లోనూ కాలుష్యం కారణంగా మరణాలు పెరుగుతున్నాయి. మన దేశంలో కాలుష్యం ఎక్కువగా ఉండే ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ తరహా మరణాలకు మరింత ఆస్కారం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ 30 సంవత్సరాలు దాటిన మహిళలపై కాలుష్యం ప్రభావం కనిపిస్తోందని ఈ స్టడీ చెబుతోంది. దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్‌‌ కూడా విడుదల చేసింది డబ్ల్యూహెచ్​వొ.

ప్రతి సంవత్సరం ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ కాలుష్యం కారణంగా అబార్షన్లు కూడా జరుగుతున్నాయని ఓ సర్వే చెబుతోంది. దక్షిణాసియాలో ప్రతీ ఏడాదీ దాదాపు 3,49,681 మంది గాలి కాలుష్యం కారణంగా ప్రెగ్నెన్సీని కోల్పోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చూసినా ప్రతి ఏడాది దాదాపు 29 శాతం మంది మహిళలు గాలి కాలుష్యం వల్ల ప్రెగ్నెన్సీని పోగొట్టుకుంటున్నట్లు తేలింది. ఎయిర్ క్వాలిటీ పూర్తిగా పడిపోవడం వల్లే ఇలా జరుగుతుందన్నది ఆ సర్వే సారాంశం.

జాగ్రత్త అవసరం

ప్రెగ్నెన్సీ అని తెలిశాక, ప్రెగ్నెన్సీ కావాలనుకునే ముందు కేర్ తీసుకోవాలి. బయటకు వెళ్ళినపుడల్లా మాస్క్ పెట్టుకోవాలి. ఫ్యాక్టరీలున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి బయటకు ఎక్కువగా వెళ్ళకుండా ఇంట్లోనే ఉండటం మంచిది. స్నేక్ ప్లాంట్, బాంబూ, అలోవెరా వంటి మొక్కలు పెంచడం వల్ల వాయు కాలుష్యాన్ని కొంతైనా తగ్గించొచ్చు. బ్రీతింగ్ సమస్యలు ఉంటే డాక్టర్‌‌‌‌ను కలిసి ట్రీట్‌‌మెంట్ తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పుట్టే పిల్లలు హెల్దీగా ఉంటారు.

ఈ ఫుడ్ తింటే మంచిది

అవిసె గింజలు

అవిసె గింజల్లో అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే గర్భవతులు ప్రతీరోజు వీటిని తినాలి. అందులో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, లిగ్నన్స్, ఫైబర్ వంటివి హెల్దీగా ఉంచుతాయి. లిగ్నన్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి ఇమ్యూనిటీని పెంచి, జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తాయి. శ్వాస సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి వాటి నుంచి రక్షిస్తాయి. కొలెస్ట్రాల్, బీపీని తగ్గించడంలోనూ ఈ గింజలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే గర్భవతులు ప్రతిరోజు వీటిని తినడం మంచిది.

పాలకూర

పాలకూరలో పోషకాలు కావాల్సినన్ని ఉంటాయి. హాని కలిగించే జబ్బుల నుంచి శరీరాన్ని కాపాడే పోషకాలు కూడా అందులో నిండుగా ఉన్నాయి. కాలుష్యం నుండి అవయవాలను, శరీరాన్ని కాపాడడంలో పాలకూరది కీరోల్. అందుకే ఫుడ్ చార్ట్‌‌లో పాలకూర మిస్ కాకూడదు.

సి విటమిన్

నిమ్మ, నారింజ లాంటి పుల్లని పండ్లు ప్రతీరోజు తినడం వల్ల శరీరానికి కావాల్సినంత  సి– –విటమిన్ అందుతుంది. వాయు కాలుష్యం కారణంగా వచ్చే బ్రీతింగ్ సమస్యల నుంచి బయటపడేయడం లోనూ  సి – విటమిన్ బాగా ఉపయోగపడుతుంది.

Tagged survey, Air Pollution, ‘silent’ miscarriages risk, abortions

Latest Videos

Subscribe Now

More News