హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం డ్యూటీలోకి తీసుకోవాలె.. మంత్రి సబితకు కస్తుర్బా కాంట్రాక్ట్ టీచర్ల వినతి

హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం  డ్యూటీలోకి తీసుకోవాలె.. మంత్రి సబితకు కస్తుర్బా కాంట్రాక్ట్ టీచర్ల వినతి

ముషీరాబాద్,వెలుగు: హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తమను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని కస్తుర్బా స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్ టీచర్లు కోరారు. మంగళవారం నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ నేతృత్వంలో టీచర్లు హైదరాబాద్ శ్రీనగర్ లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. నీల వెంకటేశ్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 1321 ప్రకారం కస్తూర్బా గాంధీ పాఠశాల్లో రెండేండ్ల కింద 937 మందిని కాంట్రాక్ట్ టీచర్లుగా భర్తీ చేశారని గుర్తుచేశారు.

ఇటీవల ప్రభుత్వం కస్తూర్బా స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1241 కాంట్రాక్ట్ టీచర్ల పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఈ కొత్త నోటిఫికేషన్ తో గత రెండేండ్లుగా పనిచేస్తున్న 937 మందిని తొలగించారని వివరించారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తొలగించిన వారికి రెండేండ్ల బోధన అనుభవం ఉందని, వీరిని తీసివేసి కొత్తవారిని రిక్రూట్మెంట్ చేయవలసిన అవసరం ఏమిటని నిలదీశారు.