నకిలీ డెత్ సర్టిఫికెట్తో ఎల్ఐసీ క్లయిమ్ చేసిన నిందితుల అరెస్ట్

నకిలీ డెత్ సర్టిఫికెట్తో ఎల్ఐసీ క్లయిమ్ చేసిన నిందితుల అరెస్ట్

బూర్గంపహాడ్,వెలుగు: బతికివున్న వ్యక్తి పేరుతో నకిలీ డెత్​ సర్టిఫికెట్​సృష్టించి రూ. 10 లక్షలు ఎల్ఐసీ క్లయిమ్ చేసుకున్న నలుగురుని భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. భద్రాచలం ఏఏస్పీ విక్రమ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..  బూర్గంపహాడ్ మండలం సారపాకకు చెందిన భూక్యా రాధ, భూక్యా శ్రీరాములు, భూక్యా లక్ష్మాతో పాటు రెడ్దిపాలెం గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ షేక్ యాకుబ్ పాషా సారపాక గాంధీనగర్ కు చెందిన ఓ వ్యక్తి బతికి ఉండగానే చనిపోయినట్లుగా నకిలీ సర్టిఫికెట్​సృష్టించారు. 

ఆ వ్యక్తి పేరుతో భద్రాచలం ఎల్ఐసీ కార్యాలయంలో రూ. 10 లక్షల ఎల్ఐసీ క్లయిమ్ చేశారు. అనంతరం ఆ డబ్బులను వారు పంచుకున్నారు. ఎల్ఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రాయల దుర్గారావుతో పాటు మరికొందరు పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు.