ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్​లో శ్రీచైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్ల సత్తా

 ఇంటర్నేషనల్ మ్యాథ్స్  ఒలింపియాడ్​లో శ్రీచైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్ల సత్తా
  • అభినందించిన ప్రధాని మోదీ

హైదరాబాద్: ఇంటర్నేషనల్  మ్యాథ్స్  ఒలింపియాడ్  (ఐఎంఓ) 2024లో తమ స్టూడెంట్లు సత్తా చాటారని శ్రీచైతన్య విద్యా సంస్థల అకాడమిక్  డైరెక్టర్  సుష్మ, శ్రీచైతన్య స్కూల్స్  అకాడమిక్  డైరెక్టర్  సీమ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ విద్యా సంస్థలకు చెందిన ఆరుగురు స్టూడెంట్లు ఐఎంఓలో 4 బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించారని వారు చెప్పారు. శ్రీచైతన్య టెక్నో స్కూల్  బావదాన్  పూణేకు చెందిన విద్యార్థి ఎంవీ ఆదిత్య అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్యతో పాటు మిగతా విద్యార్థులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​లో అభినందించారని వెల్లడించారు. ఇటీవల యూకేలోని 65వ ఇంటర్నేషనల్  మ్యాథ్స్  ఒలింపియాడ్  జరిగాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఈ సందర్భంగా వారు అభినందించారు.