కాలేజీకి వెళ్తున్న ఇంజనీరింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో జరిగింది. బుధవారం జరిగిన ఈ యాసిడ్ దాడిలో 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ముండిపార్ బస్‌స్టాండ్ సమీపంలో బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై యాసిడ్ పోశారు.
ఖల్బంధ గ్రామంలో నివసిస్తున్న బాధితురాలు నాగ్‌పూర్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతుంది. నాగ్‌పూర్‌కు వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ముఖాలకు మాస్క్ వేసుకున్న ఇద్దరు యువకులు బాధితురాలిపై యాసిడ్ దాడి చేశారు. దాడి తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. బస్‌స్టాండ్‌లో ఉన్న తోటి ప్రయాణికులు బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని నాగ్‌పూర్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
For More News..
