టీ స్టాల్ కు లక్షన్నర లంచం తీసుకుంటూ దొరికిన నిజాంపేట ఏసీపీ

టీ స్టాల్ కు లక్షన్నర లంచం తీసుకుంటూ దొరికిన నిజాంపేట ఏసీపీ
  • రూ.1.50లక్షలు లంచం తీస్కుంటూ దొరికిండు

జీడిమెట్ల, వెలుగు :  టీపాయింట్ ​నిర్వాహకుడి నుంచి రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ నిజాంపేట టౌన్ ​ప్లానింగ్ ఏసీపీ ఎం.శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కారు. నిజాంపేటకు చెందిన గొట్టిపాటి శ్రీనివాసులు నాయుడు తన బిల్డింగ్ ​ముందు టీ–పాయింట్ కంటైనర్, చెన్నపట్నం చీరలు పేరుతో అడ్వర్టైజ్​మెంట్​ బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. మున్సిపల్ ​పర్మిషన్ ​లేకుండా బోర్డు, కంటైనర్ ​ఏర్పాటు చేయకూడదని, తొలగించకుండా ఉండాలంటే రూ. లక్షా యాబై వేలు లంచం ఇవ్వాలని టౌన్​ప్లానింగ్​ఏసీపీ శ్రీనివాసరావు డిమాండ్​చేశాడు.

దీనికి స్థానిక బీఆర్ఎస్ ​లీడర్ రాములు మధ్యవర్తిగా వ్యవహరించాడు. దీంతో శ్రీనివాసుల నాయుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం బాధితుడి నుంచి రాములు రూ.1.50 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఏసీపీ శ్రీనివాసరావు, రాములును అరెస్ట్​ చేసి రిమాండుకు తరలించారు.