పట్టించింది భార్య కాదు.. ఐ బొమ్మ రవి ఎలా దొరికాడో బయటపెట్టిన పోలీసులు

పట్టించింది భార్య కాదు.. ఐ బొమ్మ రవి ఎలా దొరికాడో బయటపెట్టిన పోలీసులు

హైదరాబాద్: ఐబొమ్మ రవి దొరకడానికి కారణం అతని భార్య కాదని పోలీసులు స్పష్టం చేశారు. స్నేహితుడు నిఖిల్‌ ద్వారా ఐబొమ్మ రవిని పోలీసులు ట్రాప్ చేశారు. ఐ బొమ్మ, బప్పమ్‌ మూవీ పోస్టర్లను రవి స్నేహితుడు నిఖిల్‌ తయారు చేస్తున్నాడని అడిషనల్ సీపీ శ్రీనివాసులు తెలిపారు. గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్‌ ప్రకటనల ద్వారా డబ్బులు వచ్చేవని, ఆ డబ్బును యాడ్‌ బుల్ అనే కంపెనీకి రవి మళ్లించాడని చెప్పారు. యాడ్‌ బుల్‌ కంపెనీ రవికి చెందినదేనని, ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బు వస్తుందని అడిషనల్ సీపీ శ్రీనివాసులు బయటపెట్టారు. రవిని అతని భార్య పట్టించిందనే వార్తల్లో వాస్తవం లేదని, పూర్తిగా తప్పుడు ప్రచారమని ఆయన స్పష్టం చేశారు.

ఐబొమ్మ రవి పైరసీ కేసుపై అడిషనల్ సీపీ శ్రీనివాసులు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఐబొమ్మ డొమైన్ను Njila అనే కంపెనీలో రవి రిజిస్టర్ చేశాడని, మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నాడని ఆయన చెప్పారు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఐబొమ్మ, బప్పం ద్వారా సినిమాలు పోస్ట్ చేస్తున్నాడని తెలిపారు. బప్పం, ఐబొమ్మ వెబ్ సాఫ్ట్వేర్లో రీ డైరెక్ట్ స్క్రిప్ట్ను రాశారని.. రీడైరెక్ట్ ద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్ సైట్లకు వెళుతుందని వివరించారు. అక్కడ బెట్టింగ్, గేమింగ్ సైట్ల యాడ్స్లను యాడ్ క్యాష్, యాడ్ స్టార్ అనే కంనీలు మేనేజ్ చేస్తున్నాయని ఏసీపీ శ్రీనివాసులు చెప్పారు. బెట్టింగ్ సైట్లు యాడ్స్ డిస్ ప్లే చేయడం ద్వారా వచ్చే డబ్బు USDT ద్వారా డబ్బు ఇమంది రవికి చేరుతున్నాయని తెలిపారు.

ఐబొమ్మ వెబ్ సైట్ సూత్రధారి ఇమ్మడి రవి ఐదు రోజుల పోలీసు కస్టడీ విచారణ సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు ఐదు రోజుల పాటు రవి ఆర్థిక లావాదేవీలు, పైరసీ నెట్‌‌వర్క్‌‌, సాంకేతిక కార్యకలాపాలు వంటి అంశాలపై విచారించారు. రవి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా జరిగిన డబ్బు మార్పిడి, విదేశీ కరెన్సీ బదిలీలపై లోతుగా దర్యాప్తు చేశారు. రవికి చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.30 కోట్లకు పైగా లావాదేవీలు గుర్తించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పైరసీ ద్వారా గత ఐదేండ్లలో 100 కోట్ల రూపాయల వరకు రవికి ఆదాయం వచ్చినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

పోలీసుల విచారణలో రవి టెలిగ్రాం యాప్  ద్వారా సినిమాలను కొనుగోలు చేసి, వాటిని ఐబొమ్మ సైట్లో రిలీజ్ చేస్తున్నట్లు బయటపడింది. సైట్‌‌లో సినిమా క్లిక్  చేయగానే యూజర్లను  మ్యాట్రిమోని, బెట్టింగ్, గేమింగ్ యాప్‌‌లకు మళ్లించేలా 15కు పైగా యాడ్ నెట్‌‌వర్క్‌‌లను లింక్  చేసినట్లు పోలీసులు గుర్తించారు. మన దేశంలోని ఐడీఎఫ్‌‌సీ బ్యాంక్  ద్వారా వచ్చిన డబ్బును రవి క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు పంపినట్లు సమాచారం.