ఆపరేషన్ మేడ్చల్.. యాక్షన్ ప్లాన్ షురూ..

ఆపరేషన్ మేడ్చల్..  యాక్షన్ ప్లాన్ షురూ..

కరోనా కంట్రోల్ కి యాక్షన్ ప్లాన్
కొన్ని పీహెచ్ ల పరిధిలోనే భారీగా కేసులు
హాట్ స్పాట్స్ పై అధికారుల ఫోకస్
బల్దియాతో సంబంధం లేకుండా జిల్లా వైద్య శాఖ చర్యలు

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో అధికారులు పరేషాన్లో పడ్డారు. మొదటి నుంచి జీహెచ్ఎంసీతో సరైన కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండడంతో ఇప్పటికి స్పెషల్ ఫోకస్ పెట్టారు. హాట్ స్పాట్ ఏరియాలను గుర్తించి, కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు.

హాట్ స్పాట్లు ఇవే..
జిల్లాలో మొత్తం 37 పీహెచ్ సీల పరిధిలో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. ఇప్పటివరకు 54,451 శాంపిల్స్ కలెక్ట్చేశారు. అందులో 15,816 పాజిటివ్ వచ్చాయి. దుండిగల్లో 2,074, ఉప్పల్లో 1,618, మల్కాజిగిరిలో 1,390, బాలా నగర్లో 1,103, అల్వాల్లో 588, షాపూర్ నగర్లో 507, కూకట్ పల్లిలో 610, కుషాయిగూడలో 557, నారపల్లిలో 434 కేసులున్నాయి. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలోని మొత్తం కేసుల్లో 60శాతం మంది వైరస్ బారిన పడిన వారు ఈ ఏరియాల్లోనే ఉన్నారు. గతంలోనే వాటిని హాట్ స్పాట్ ఏరియాలుగా గుర్తించిన అధికారులు.. ఇప్పుడు వీటిపై స్పెషల్ ఫోకస్ చేసి కేసులు తగ్గించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు.

టెస్ట్లు, ట్రేసింగ్లపై దృష్టి
జిల్లాలోని జీహెచ్ఎంసీ ఏరియాల్లోఉన్న కేసులపై బల్దియా నుంచి సరైన సమాచారం లేకపోవడంతో వాటిపై దృష్టిపెట్టలేకపోతున్నామని జిల్లా అధికారులు చెప్తున్నారు. కాగా, జీహెచ్ఎంసీతో సంబంధం లేకుండా జిల్లావైద్యాధికారులు పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దాంతో హోం ఐసోలేషన్ లో ఉన్నవారి రాకపోకలపై పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారు. టెస్టులు, ట్రేసింగ్ తోపాటు ట్రాన్స్ మిషన్ ను నిలువరించేలా ఆపరేషన్ మేడ్చల్ పై దృష్టిపెడ్తున్నారు.

కోఆర్డినేషన్ లేకనే ప్రాబ్లమ్
మేడ్చల్ జిల్లాలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లో 12,572 కేసులున్నాయి. మున్సిపాలిటీలు, రూరల్ ఏరియాలు కలిపి 3,244 మంది బాధితులున్నారు. ఇప్పుడిదే జిల్లా అధికారులను టెన్షన్ పెట్టిస్తోంది. ఇటీవల సెంట్రల్ మీటింగ్ లోనూ జీహెచ్ఎంసీ, జిల్లా యంత్రాంగం మధ్యలేని కోఆర్డినేషన్ పై చర్చకు వచ్చింది. కేసుల ట్రేసింగ్ కంటే ట్రాన్స్ మిషన్ వేగంగా ఉండడంపై స్టడీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పీహెచ్ సీల పరిధిలోని హాట్ స్పాట్లలో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యశాఖ ఆదేశించింది. జిల్లా వైద్య ఉన్నతాధికారుల అవగాహన లోపమే కేసులు పెరగడానికి కారణమని సీరియస్ అయినట్లు తెలిసింది. అన్ లాక్ కి ముందు నుంచే పూర్తి పర్యవేక్షణ జీహెచ్ఎంసీదే అన్నట్లు ఓ ముఖ్య వైద్యాధికారి వ్యవహరించడమే కేసులు పెరగడానికి కారణమని జిల్లా వైద్యాధికారులు చర్చించుకుంటున్నారు.

For More News..

చైనాకు రాష్ట్రపతి కోవింద్ ఇన్ డైరెక్ట్ వార్నింగ్

గల్వాన్‌ గొడవలో మా బాధ్యత లేదు