T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 దశలో భాగంగా పాకిస్తాన్ ఈరోజు (ఫిబ్రవరి 28న) కాండీలో శ్రీలంకతో కీలక మ్యాచ్ ఆడబోతుంది. సెమీఫైనల్‌కి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో పాక్ తప్పనిసరిగా గెలవాల్సిందే. ప్రస్తుతం సూపర్–8 గ్రూప్ 2లో న్యూజిలాండ్ 3 మ్యాచ్‌లకు 3 పాయింట్లు, +1.390 నెట్ రన్‌రేట్‌తో రెండో స్థానంలో కొనసాగుతుంది. పాకిస్తాన్ మాత్రం రెండు మ్యాచ్‌లకు 1 పాయింట్, -0.461 నెట్ రన్‌రేట్‌తో మూడో స్థానంలోనే ఉంది.
సెమీఫైనల్ సమీకరణలు:
గ్రూప్–2లో రెండో స్థానంలోకి వెళ్లాలంటే శ్రీలంకపై సుమారు 64 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలవాల్సి ఉంటుంది.. లేదా 160 పరుగుల లక్ష్యాన్ని దాదాపు 13.1 ఓవర్లలో చేధించాలని ఐసీసీ విక్టరీ మార్జిన్ ని రిలీజ్ చేసింది. ఇక మ్యాచ్ వర్షంతో రద్దయితే పాకిస్తాన్‌కు కేవలం 2 పాయింట్లు మాత్రమే వస్తాయి. అప్పుడు న్యూజిలాండ్ సెమీస్‌కి చేరుకుంటుంది. దాయాది దేశం ఇప్పటివరకు సూపర్–8లో ఒకే పాయింట్ సంపాదించింది. అది న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో మాత్రమే వచ్చింది.
వాతావరణం:
అక్క్యువెదర్ అంచనాల ప్రకారం.. పల్లెకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వర్షం పడే అవకాశం కేవలం 1 శాతం మాత్రమే ఉందని తెలిపింది. ఉష్ణోగ్రత 19 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే ఛాన్స్ ఉంది.
సెమీఫైనల్ వేదికలు:
పాకిస్తాన్ సెమీస్‌కి అర్హత సాధిస్తే తొలి సెమీఫైనల్ కొలంబోలోనే జరుగుతుంది. కానీ న్యూజిలాండ్ వెళ్తే మాత్రం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ నిర్వహిస్తారు.
ఇరు జట్ల అంచనా:
శ్రీలంక జట్టు:
పతుమ్ నిస్సాంక, కుశల్ మెండిస్ (వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనాక (కెప్టెన్), దుషన్ హేమంత, దునిత్ వెల్లాలగే, దుష్మంత చమీర, మహీష్ తీక్షణ, కుశల్ పెరేరా
పాకిస్తాన్ జట్టు:
సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాహీన్ అఫ్రిది, సల్మాన్ మిర్జా, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్.
గ్రూప్ 2 పాయింట్ల పట్టిక:
* ఇంగ్లాండ్– 6 పాయింట్లు (3 మ్యాచ్‌లు), NRR +1.096
* న్యూజిలాండ్ – 3 పాయింట్లు (3 మ్యాచ్‌లు), NRR +1.390
* పాకిస్తాన్ – 1 పాయింట్ (2 మ్యాచ్‌లు), NRR -0.461
* శ్రీలంక – 0 పాయింట్లు (2 మ్యాచ్‌లు), NRR -2.800
