కస్టమర్లను మోసం చేస్తున్న .. సంస్థలపై చర్యలు తీస్కోవాలి

కస్టమర్లను మోసం చేస్తున్న .. సంస్థలపై చర్యలు తీస్కోవాలి
  • కన్జూమర్ రైట్స్ ప్రొటెక్షన్  కౌన్సిల్ డిమాండ్ 

ఖైరతాబాద్, వెలుగు : సెలబ్రిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకర్షణీయమైన ప్రకటనలు చేయిస్తూ నాణ్యత లేని ఉత్పత్తులను జనాలకు కట్టబెడుతూ మోసం చేస్తున్న సంస్థలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కన్జూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేషనల్ కన్జూమర్ డే సందర్భంగా ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ గంట స్వామి, ఉపాధ్యక్షుడు మహ్మద్ బిలాల్, కో ఆర్డినేటర్ విజయ రాణి, లీగల్ అడ్వయిజర్ ఆంజనేయులు మాట్లాడారు.

కస్టమర్లు రిటైల్ ధర, ఎక్స్ పైరీ డేట్​లను గమనించి వస్తువులను కొనాలని సూచించారు. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలన్నారు. సినిమా హాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫుడ్ ఐటమ్స్​ను నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేటుకు అమ్ముతూ జనాల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై  అవగాహన కల్పించేందుకు తమ కౌన్సిల్ ఆధ్వర్యంలో జనవరి 20న  సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ కౌన్సిల్ నుంచి దాదాపు 200కు పైగా కేసుల్లో కన్జ్యూమర్లకు న్యాయం జరిగేలా పోరాటాలు చేశామని పేర్కొన్నారు. సమావేశంలో మహీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
తదితరులు పాల్గొన్నారు.

శాంతినగర్​లో అవగాహన ర్యాలీ..

ముషీరాబాద్ :  నేషనల్ కన్జ్యూమర్స్ డే సందర్భంగా ముషీరాబాద్ పరిధి శాంతినగర్​లో కన్జూమర్స్ రైట్స్ ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. సివిల్ సప్లయర్ అధికారులు పాల్గొని జనాలకు అవగాహన కల్పించారు.