స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సూసైడ్‌‌‌‌‌‌‌‌కు కారకులపై చర్య తీసుకోవాలి

స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సూసైడ్‌‌‌‌‌‌‌‌కు కారకులపై చర్య తీసుకోవాలి
  •      బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఎదుట ధర్నా

బెల్లంపల్లి, వెలుగు : స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సూసైడ్‌‌‌‌‌‌‌‌కు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్లు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ, ఏఐబీఎఫ్, ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌, పీడీఎస్‌‌‌‌‌‌‌‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌ కాలేజీ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల జిల్లా అధ్యలు ఎర్ర ఆదర్శ్‌‌‌‌‌‌‌‌వర్ధన్‌‌‌‌‌‌‌‌రాజు, అల్లి సాగర్‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌, సబ్బని రాజేంద్రప్రసాద్, రెడ్డి చరణ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కాలేజీలో సెకండ్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ చదువుతున్న స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ వైష్ణవి సూసైడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడం బాధాకరం అన్నారు.

 హెచ్‌‌‌‌‌‌‌‌వోడీ సాంబయ్య, లెక్చరర్లు మాలతి, ఫణికుమార్‌‌‌‌‌‌‌‌తో పాటు హాస్టల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ నాగరాజు తిట్టడం వల్లే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. సూసైడ్‌‌‌‌‌‌‌‌కు కారణమైన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. స్టూడెంట్ల ఆందోళన విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ ఇన్స్‌‌‌‌‌‌‌‌పెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎన్. దేవయ్య, రూరల్ ఇన్స్‌‌‌‌‌‌‌‌పెక్టర్‌‌‌‌‌‌‌‌ అఫ్జలొద్దీన్‌‌‌‌‌‌‌‌, వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ ఎస్సైలు సురేశ్‌‌‌‌‌‌‌‌, జి.రమేశ్‌‌‌‌‌‌‌‌, టూ టౌన్‌‌‌‌‌‌‌‌ ఎస్సై రమేశ్‌‌‌‌‌‌‌‌ కాలేజీకి చేరుకొని స్టూడెంట్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

 అయినా వినని స్టూడెంట్లు మూడు గంటలపాటు ఆందోళన చేశారు. అనంతరం ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఎర్ర ఆదర్శ్‌‌‌‌‌‌‌‌ వర్ధన్‌‌‌‌‌‌‌‌రాజు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్య ఘటనను విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీకి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫోన్‌‌‌‌‌‌‌‌లో ఏసీపీ రవికుమార్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. దీంతో స్టూడెంట్లు తమ ఆందోళనను విరమించారు.