రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం

రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం
  • కోరుట్ల మార్కెట్​యార్డులో రైతుల ఆందోళన
  • స్థలం సరిపోక  ఇబ్బందులు పడతామని ఆవేదన 
  • నచ్చజెప్పి శంకుస్థాపన చేసిన మంత్రి, ఎమ్మెల్యే 
  • ఇంటిగ్రేటెడ్ ​మార్కెట్ నిర్మించొద్దంటూ నిరసన 

కోరుట్ల, వెలుగు: కోరుట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్​ వెజ్ , నాన్ వెజ్ మార్కెట్  నిర్మాణం చేపట్టవద్దని రైతులు  ఆందోళనకు దిగారు. ఆదివారం కోరుట్లలోని వ్యవసాయ మార్కెట్​ యార్డులో రూ.6  కోట్ల 50 లక్షలతో కొత్తగా ఇంటిగ్రేటెడ్​వెజ్, నాజ్​వెజ్​మార్కెట్​నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు, ఎమ్మెల్సీ ఎల్​.రమణ​, కలెక్టర్​రవి  భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అంతకు ముందే వ్యవసాయ మార్కెట్​యార్డు దగ్గరకు వచ్చిన కొంతమంది రైతులు నిరసనకు దిగారు. మార్కెట్ యార్డ్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎందుకని..దీనివల్ల భవిష్యత్​లో ధాన్యం అమ్మకానికి తీసుకువచ్చినప్పుడు స్థలం సరిపోక ఇబ్బందులు తలెత్తుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న టీఆర్ఎస్​ టౌన్​ ప్రెసిడెంట్​అన్నం అనిల్​ వారిని సముదాయించి లోపలికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి శంకుస్థాపన కోసం వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్​, ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు, ఎమ్మెల్సీ ఎల్​.రమణ, కలెక్టర్​ రవి మొదట ఆందోళన చేసిన  రైతులను కలుసుకున్నారు. మార్కెట్​లో కొత్త నిర్మాణాల వల్ల  స్థలం సరిపోక ఇబ్బందులు వస్తాయని రైతులు వారికి విన్నవించుకున్నారు. కాబట్టి కొత్త నిర్మాణాలు వద్దని వినతిపత్రం ఇచ్చారు. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు నచ్చజెప్పడంతో శాంతించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్​వెజ్​, నాజ్​ వెజ్​ మార్కెట్​ నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన జరిపారు.