హైదరాబాద్, వెలుగు: రిలయన్స్, బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) భాగస్వామ్య సంస్థ జియో- బీపీ తీసుకొచ్చిన యాక్టివ్ టెక్నాలజీ పెట్రోల్‌ను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2026లో విడుదల చేశారు.
సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఈ యాక్టివ్ టెక్నాలజీ ఇంధనం వాడటం వల్ల వాహనాలు ఏటా 100 కిలోమీటర్ల అదనపు మైలేజీని ఇస్తాయని జియో బీపీ ప్రకటించింది. ఇది ఇంజిన్ లోపలి భాగాలను శుభ్రంగా ఉంచి పనితీరును మెరుగుపరుస్తుంది.
అదనపు ఖర్చు లేకుండానే వినియోగదారులకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. అన్ని జియో- బీపీ బంకుల్లో యాక్టివ్ పెట్రోల్ లభిస్తుంది.
