Anushka Sharma: కోహ్లి భార్య కోర్టుకు

Anushka Sharma: కోహ్లి భార్య కోర్టుకు

ఆదాయపు పన్ను శాఖ నోటీసులపై క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య, నటి అనుష్క శర్మ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2012 – 13, 2013 – 14  సంవత్సరాలకు సంబంధించిన బకాయిలపై.. సేల్స్ ట్యాక్స్ డిపార్టెమెంట్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. అనుష్క బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..  మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఐటీశాఖకు నోటీసులు పంపింది. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. 

మహారాష్ట్ర వాల్యూ యాడెడ్ టాక్స్ యాక్ట్ కింద 2012 – 13, 2013 – 14 అసెస్‌మెంట్ ఇయర్ కు సంబంధించి మజ్‌గావ్‌లోని సేల్స్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులపై అనుష్క అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే.. తనకు వర్తించే దాని కంటే ఎక్కువ పన్ను వేశారని అనుష్క కోర్టుకు తెలిపింది.  దీని వల్ల తాను ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తోందని చెప్పింది. ఇక ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తనకు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. టాక్సేషన్ కన్సల్టెంట్ శ్రీకాంత్ వేలేకర్ ద్వారా అనుష్క బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబందించి ఆమె 2012, 2016 మధ్య నాలుగు పిటిషన్లు దాఖలు చేసింది. అయితే అంతకుముందు ఆమె అభ్యర్థనను నిరాకరించిన హైకోర్టు.. గత వారం తాజాగా మరోసారి పిటిషన్లు దాఖలు చేయడంతో విచారణకు అంగీకరించింది.