పోలీస్ బిడ్డగా.. పోలీసులకు సెల్యూట్ చేస్తున్నా..

పోలీస్ బిడ్డగా.. పోలీసులకు సెల్యూట్ చేస్తున్నా..

కరోనా బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్టు చేశారు. ‘పోలీసులు నిద్రాహారాలుమాని పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. నేను హైదరాబాద్ లో చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్ డౌన్ సక్సెస్ అయింది. వారి వల్లే కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది. అందువల్ల సామాన్య జనం పోలీసులకు సహకరించాలి. కరోనాను తుదిముట్టించడంలో, అంతమొందించడంలో వారికి చేదోడువాదోడుగా మనందరం ఉండాలి. పోలీసు వాళ్లు చేస్తున్న ఈ అమోఘ ప్రయత్నానికి పోలీసు బిడ్డగా.. వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను’ అని వీడియో ట్వీట్ చేశారు.

కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం యావత్తు 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే ప్రజలు మాత్రం ప్రతిరోజూ ఏదో ఒక పని మీద బయటకు వస్తూనే ఉన్నారు. అలా వచ్చే వారందరినీ కంట్రోల్ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖను ఆదేశించాయి. దాంతో పోలీసులు రాష్ట్రమంతా గస్తీకాస్తూ.. ఎవరినీ రోడ్ల మీదికి రాకుండా ఆపుతున్నారు. కొన్ని చోట్ల లాఠీలకు సైతం పనికల్పిస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీదికి వచ్చే వారి వాహానాలను సీజ్ కూడా చేస్తున్నారు. పోలీసులు ఇలా చేయడం వల్లే లాక్ డౌన్ విజయవంతమవుతోంది.

అయితే లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. చాలా మంది పేదలు తినడానికి తిండి కూడా లేక పస్తులు ఉంటున్నారు. అటువంటి ఈ క్లిష్ట సమయంలో చాలా మంది మానవతావాదులు ముందుకొచ్చి ఎంతోకొంత ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన వంతు సాయంగా సినీరంగ కార్మికుల కోసం రూ. కోటి విరాళంగా ప్రకటించారు.

For More News..

హెల్త్ వర్కర్లకు డబుల్ సాలరీ

కోహ్లీని రెచ్చగొడితే మరింత బాగా ఆడతాడు

ప్రమాదంలో దాదాపు 20 లక్షల జాబ్స్