
జగపతిబాబు స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేసిన ఫొటో సంచలనంగా మారింది. తిట్టే ఛాన్స్ నెటిజన్లకు, ఫ్యాన్స్ కు ఇవ్వకుండా.. తనను తానే తిట్టుకుంటూ.. క్యాసినోలో దిగిన ఫొటోతో.. క్యాప్షన్ ఇవ్వటం జగపతిబాబు స్టయిల్ కు వెరైటీ.
ఎప్పుడు.. ఎక్కడి క్యాసినో అనేది చెప్పలేదు..రాయల్ క్యాసినోలో దిగిన ఫొటో షేర్ చేయటం విశేషం. క్యాసినోకు వెళతాడని..డబ్బులన్నీ అలాగే తగలేశాడని గతంలో అతనిపై చాలా రూమర్స్ వచ్చాయి..చాలా ఇంటర్వ్యూల్లో ఇదే విషయంపై ప్రశ్నలను ఎదుర్కొన్నారు జగపతిబాబు. ఆ తర్వాత మారిన మనిషిగా..ఫిలాసఫీగా మారారు. చాలా సంవత్సరాల తర్వాత..క్యాసినోలో జగపతిబాబు దిగిన ఫొటోను..తనకు తానుగా పోస్ట్ చేస్తూ..సిగ్గూ శరం లేనివాడినని దిగులు పడను..మీరు చెబితే పడతాను అనే క్యాప్షన్ తనకు తానే ఇవ్వటం అనేది హైలెట్ గా నిలిచింది.
Siggu saram Leni Vadinnani diggulu paddanu. Meeru cheppitthey padathaanu. pic.twitter.com/ObmV2ACHq5
— Jaggu Bhai (@IamJagguBhai) July 18, 2024
క్యాసినోలో జగపతిబాబు ఫొటో, క్యాప్షన్ ఇప్పుడు వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏ సినిమా షూటింగ్ కోసం ఈ సెట్ వేశారు అని కొందరు అంటే..పేకాట, జూదం ఆడాలంటే ఆడేయ్..ఏ వెధవకు భయపడేది లేదు సార్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు నెటిజన్లు అయితే నిన్ను నువ్వే తిట్టుకున్నావ్ చూడు అది హైలెట్ అంటూ ఫన్నీ రిప్లయ్స్ ఇస్తున్నారు. ఏదిఏమైనా క్యాసినోలో ఉన్న జగ్గూభాయ్ గెటప్ మాత్రం అదిరింది.. ఈ స్టిల్ సినిమాలోనిదా లేక ఒరిజినలా అనేది తెలియాలి అంటే వెయిట్ అండ్ సీ...