సుదీప్తో డీకే శివకుమార్ భేటీ.. కాంగ్రెస్ లోకి.?

సుదీప్తో డీకే శివకుమార్ భేటీ.. కాంగ్రెస్ లోకి.?

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ భేటీ అయ్యారు.  బెంగళూలోని సుదీప్ ఇంటికి డీకే శివకుమార్ వెళ్ళి కలిశారు. వీరి భేటీకి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి. అయితే  శివకుమార్ సుదీప్ ను మర్యాదపూర్వకంగానే  కలిశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రస్తుతం కన్నడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.  గత కొన్ని రోజులుగా సుదీప్ కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ భేటీతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లుగా మారింది. అయితే కాంగ్రెస్  స్టార్ క్యాంపెయినర్ గా సుదీప్ ను నియమించే అవకాశముందని తెలుస్తోంది. మరి  వీటన్నింటికి సుదీప్ క్లారిటీ ఇస్తారా లేదా అన్నది చూడాలి.