Manchu Manoj Daughter: ఘనంగా మంచు మనోజ్ కుమార్తె నామకరణ వేడుక..ఎంతో అర్ధం వచ్చేలా పాప పేరు  

Manchu Manoj Daughter: ఘనంగా మంచు మనోజ్ కుమార్తె నామకరణ వేడుక..ఎంతో అర్ధం వచ్చేలా పాప పేరు  

టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj), భూమా మౌనిక(Mounika) ఇద్దరు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం నాడు(జూలై 8న)మంచువారి చిట్టి మహాలక్ష్మికి నామకరణం చేసి..ఆ పేరును సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు మంచు మనోజ్.ఇంతకు పాప పేరు ఏంటంటే..'దేవసేన శోభ ఎంఎం'(Devasena Shobha MM).ఈ పేరు డివోషనల్గా,ఎమోషనల్గా చాలా అర్థం వచ్చేలా పేరు పెట్టడం జరిగింది. 

దేవసేన అనగా సుబ్రమణ్యం స్వామి భార్య.ఆమె శివ భక్తురాలిగా మంచి పేరు కలదు.అలాగే మనోజ్ భార్య అయిన మౌనిక తల్లి శోభ నగర్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు  ఆమె ఎంతో పరిచయం కూడా.అందుకే ఆమె జ్ఞాపకానికి గుర్తుగా ఈ పేరును మనోజ్ తన కూతురు కోసం ఎంపిక చేసుకున్నాడు.ఇక MM అంటే మౌనిక, మనోజ్‌,మంచు,మోహన్‌ బాబు..పలురకాలైన పేర్లు వస్తుండటం విశేషం.ఈ కార్యక్రమం ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది.ఏదేమైనా పాపకి భలే పేరు పెట్టావ్ మనోజ్ అన్న..అంటూ విషెష్ చెబుతున్నారు మంచు ఫ్యాన్స్. 

ప్రస్తుతం మంచు మనోజ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) తన నెక్స్ట్ సినిమాగా వస్తోన్న'మిరాయ్'లో కీ రోల్ లో నటిస్తున్నాడు. స్టైలీష్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే తాను హీరోగా వాట్ ది ఫిష్ అనే మూవీతో పాటు మరో సినిమా చేస్తున్నాడు.