Bigg Boss Telugu 9: 'బిగ్ బాస్ తెలుగు 9' కంటెస్టెంట్ కు మెగా సపోర్ట్.. వైరల్ అవుతున్న నాగబాబు పోస్ట్!

Bigg Boss Telugu 9: 'బిగ్ బాస్ తెలుగు 9' కంటెస్టెంట్ కు మెగా సపోర్ట్.. వైరల్ అవుతున్న నాగబాబు పోస్ట్!

తెలుగు ప్రేక్షకులను అలరించడానికి 'బిగ్ బాస్ తెలుగు 9 ' సీజన్ ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.  కింగ్ నాగార్జున హోస్ట్ గా మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ సీజన్ పై ఇప్పటికే అంచనాలు రెట్టింపు అయ్యాయి.. ఈ 15 మందిలో తొమ్మిది మంది సెలబ్రిటీలు కాగా, ఆరుగురు సాధారణ కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే షో ప్రారంభమైన మొదటి రోజే, అనూహ్యంగా ఓ కంటెస్టెంట్‌కు సినీ నటుడు, నిర్మాత, జనసేన నేత నాగబాబు తన మద్దతును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆయన మద్దతు పొందిన కంటెస్టెంట్ మరెవరో కాదు. పాపులర్ సీరియల్ కార్తీక దీపంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు భరణి శంకర్. 'బిగ్ బాస్' ఇంట్లోకి అడుగుపెట్టిన భరణి శంకర్‌కు శుభాకాంక్షలు చెబుతూ నాగబాబు తన అధికారిక ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. నాకు చాలా అత్యంత సన్నిహితుడైన  నటుడు భరణి శంకర్..  'బిగ్ బాస్ సీజన్ 9' లోకి అడుగుపెడుతున్నందుకు ఆల్ ది బెస్ట్. ఈ ప్రయాణంలో అతనికి కావాల్సిన గుర్తింపు, విజయం తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

భరణి శంకర్ ఎవరు?
భరణి శంకర్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు. ముఖ్యంగా 'కార్తీక దీపం' సీరియల్‌లో ఆయన పోషించిన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బుల్లితెరపై తన నటనతో ఎన్నో కుటుంబాల్లో ఒక సభ్యుడిగా మారిపోయిన భరణి శంకర్..  ఇప్పుడు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో వేదికపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆయన ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు, తోటి కంటెస్టెంట్లతో ఎలా మసలుకుంటారు, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు అన్న దానిపై ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది.

నాగబాబు మద్దతు ఎందుకు ముఖ్యం?
నాగబాబు లాంటి ఒక ప్రముఖ నటుడు, ఒక కంటెస్టెంట్‌కు మొదటి రోజే మద్దతు ప్రకటించడం అనేది షో చరిత్రలో అరుదైన విషయంగా ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక నాగబాబు, భరణి శంకర్ మధ్య ఉన్న స్నేహం కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా 'బిగ్ బాస్' వంటి షోలలో కంటెస్టెంట్లకు మద్దతు అనేది వారి ప్రయాణం మధ్యలో లేదా చివర్లో మొదలవుతుంది. కానీ, భరణి శంకర్ విషయంలో ఇది మొదటిరోజే జరగడం, ఆయనకు ప్రేక్షకుల దృష్టిలో ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది. ఈ మద్దతుతో భరణి శంకర్ ఓటింగ్ పరంగా ముందు ఉంటారా లేదా ఇతర కంటెస్టెంట్ల నుండి సవాళ్లను ఎదుర్కొంటారా అనేది చూడాలి.

ఈ సీజన్‌లో 9 మంది సెలబ్రిటీలు, ఆరుగురు సామాన్యులు ఉన్నారు. కానీ నాగబాబు మద్దతుతో భరణి శంకర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ లాంటి ప్రయాణంలో కేవలం బయట మద్దతు మాత్రమే కాకుండా, ఇంటి లోపల సత్తా చాటడం కూడా ముఖ్యం. భరణి శంకర్ ఈ సవాళ్లను ఎలా అధిగమించి, బిగ్ బాస్ హౌస్‌లో ఎంత కాలం నిలబడతారోచూడాలి మరి.