‘సాక్షి’ నుంచి నాగబాబు ఫస్ట్ లుక్

‘సాక్షి’ నుంచి నాగబాబు ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ 'సాక్షి' చిత్రం నుంచి నాగబాబు ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీ టైటిల్ లోగోను, నాగబాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బెక్కెం వేణు గోపాల్, దాము సంయుక్తంగా విడుదల చేశారు. సాక్షి సినిమా నుంచి హీరో లుక్ ఇదివరకే రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. శివ కేశ‌నకుర్తి ద‌ర్శక‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మునగాల సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

చిరంజీవి బర్త్ డే రోజున నాగబాబు ఫస్ట్ లుక్ రావడం ఆనందంగా ఉందని నిర్మాత సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసిన నిర్మాత దిల్ రాజుకు థాంక్స్ చెప్పారు. మా సినిమా కోసం దిల్ రాజు ముందుకు రావడం హ్యాపీగా ఉందని.. సినిమా చాలా బాగా వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు. ఈమూవీలో శరణ్, జాహ్నవి కపూర్ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారని నిర్మాత తెలిపారు. ఇందులో నాగబాబు మెయిన్ విలన్‌గా ముఖ్యమైన పాత్రలో నటించారు. పెద్ద క్యాస్టింగ్‌తో సాక్షి సినిమా మీ ముందుకు రాబోతోందని అన్నారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నిర్మాత సుధాకర్ రెడ్డి వెల్లడించారు. 

న‌టీన‌టులు: శ‌ర‌ణ్ కుమార్‌, జాహ్నవి కపూర్
సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌:  శ్రీ వెన్నెల క్రియేష‌న్స్‌
స‌మ‌ర్ప‌ణ‌:  బేబీ ల‌లిత‌
నిర్మాత‌: మునగాల సుధాక‌ర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం:  శివ కేశ‌న కుర్తి
సినిమాటోగ్ర‌ఫీ:  చైత‌న్య కందుల‌
మ్యూజిక్‌:   భీమ్స్ సిసిరోలియో
ఆర్ట్‌:  కె.వి.ర‌మ‌ణ‌
ఎడిట‌ర్‌:  సెల్వ కుమార్