
‘బ్యూటీ’ సినిమా చూస్తే అమ్మాయిలకు వాళ్ళ తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు వస్తాయన్నారు నటులు వీకే నరేష్, వాసుకి. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా ఎస్ఎస్ వర్ధన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వీరిద్దరూ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 19న సినిమా రిలీజ్. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ‘ఈ కథ లోని సోల్, థీమ్ ఈ సినిమాకు బ్యూటీ.ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ ఉన్న చిత్రమిది.
రియలిస్టిక్ కంటెంట్‌ను చాలా ఆర్గానిక్‌గా చూపించారు. ఈ సినిమా చూస్తే అమ్మాయిలకు వాళ్ల నాన్న గుర్తొచ్చి కన్నీళ్లు వస్తాయి. తండ్రీ కూతుళ్ల రిలేషన్‌కు అందరూ కనెక్ట్ అవుతారు’ అని అన్నారు. నటి వాసుకి మాట్లాడుతూ ‘ఒక తల్లిగా ఈ కథకు కనెక్ట్ అయ్యా. తల్లికూతుర్ల మధ్య ఉండాల్సిన అవగాహన, బాధ్యత ఇందులో ఉన్నాయి. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలకు నచ్చుతుంది’ అని చెప్పారు.