హైదరాబాద్, వెలుగు: కిడ్నీసమస్యతో బాధపడుతున్న సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లారు. గురువారం ఉదయం ఎప్పటిలా గానే డయాలసిస్ చేయించుకున్న ఆయన సాయంత్రం 4 గంటల టైమ్ లో అపస్మారక స్థి తికి వెళ్లారు. ఫ్యామిలీ మెంబర్స్ సోమాజిగూడా యశోదా హాస్పటల్ కి తరలించగా, కోమాలోకి వెళ్లినవెళ్లిట్లు డాక్టర్లు గుర్తించా రు. 48 గంటలపాటు అబ్జర్వే షన్లో ఉంచాలని చెప్పారు. వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఇంట్లో కింద పడి నర్సింగ్ కు గాయాలైనట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తమని ఆయన భార్య చిత్ర తెలిపారు.
