నీ చేతి ముద్ద తినాలని ఉందమ్మా.. నటి ఎమోషనల్ పోస్ట్

నీ చేతి ముద్ద తినాలని ఉందమ్మా.. నటి ఎమోషనల్ పోస్ట్

తమిళ బుల్లితెర నటి పవిత్ర లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. కొద్దిరోజుల క్రితం ఆమె తల్లి కన్నుమూసారు. ఆ విషాదం నుండి పవిత్ర లక్ష్మి బయటకు రాలేకపోతోంది. ఇందులో భాగంగా ఆమె తన తల్లిని తలుచుకుంటూ  ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 

"అమ్మా నువ్వు మమ్మల్ని విడిచివెళ్లి అప్పుడే ఏడు రోజులైంది. ఈ బాధ నుంచి బయటపడాలని చూస్తున్నా.. కానీ నావల్ల కావడం లేదు. నువ్వు ఎందుకింత త్వరగా నన్ను వదిలి వెళ్లిపోయావో అర్థం కావటం లేదు. దాదాపు 5 ఏళ్లుగా నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు అక్కడ ఉండవని భావిస్తున్నా. నువ్వు ఒక సూపర్ మామ్. సింగిల్‌ పేరెంట్‌గా ఉంటూ బిడ్డల్ని చూసుకోవటం అంత తేలికైన విషయం కాదు. నాకు నిన్ను ఓ సారి చూడాలని ఉంది. నీతో మాట్లాడాలని ఉంది. నీ చేతి ముద్దలు తినాలని ఉంది. ఈ కష్ట సమయంలో నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది విత్ర లక్ష్మి. 

ఈ పోస్ట్ చేసిన సినీ ప్రముఖులు ఆమెకు సంఘీభావం తెలుపుతున్నారు.