Pavitra Punia: 'మళ్లీ ప్రేమలో పడిపోయా.. శ్రీమతిని కాబోతున్నా': బిగ్ బాస్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌ పిక్స్‌ వైరల్‌

Pavitra Punia: 'మళ్లీ ప్రేమలో పడిపోయా.. శ్రీమతిని కాబోతున్నా': బిగ్ బాస్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌ పిక్స్‌ వైరల్‌

టెలివిజన్ నటి, బాలీవుడ్ బిగ్ బాస్ 14ఫేమ్.. పవిత్రా పునియా మరోసారి ప్రేమలో మునిగిపోయింది. నటుడు ఐజాజ్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత, మిస్టరీ మేన్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. తాజాగా తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా పలు ఫోటోలు పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలలో సముద్ర తీరంలో జరిగిన ఆ కలల ప్రపోజల్ దృశ్యాలు అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. మొదటి ఫొటోలో పవిత్ర ప్రియుడు ఒక మోకాలిపై కూర్చొని ఆమెకు రింగ్ పెట్టి ప్రపోజ్ చేస్తుండగా, తర్వాతి చిత్రాల్లో పవిత్రా ఆనందభాష్పాలతో అతన్ని కౌగిలించుకుంటూ కనిపించింది. అయితే, తనకి కాబోయే భర్త ముఖం ఇందులో ఎక్కడా కనిపించదు.

►ALSO READ | Thamma Box Office: రష్మిక ‘థామా’ షాకింగ్ వసూళ్లు.. మాడాక్ హారర్ యూనివర్స్ అంచనాలు అందుకుందా?

'లాక్డ్ ఇన్ లవ్.. మేడ్ ఇట్ అఫీషియల్.. సూన్ టుబీ మిస్సెస్..' అని రాయడంతో అభిమానుల్లో ఆసక్తి పెంచింది. హ్యాష్యాగ్ "#ఎన్ఎస్" వాడటంతో ఆ మిస్టరీ మాన్ ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత సోషల్ మీడియాలో ఊపందుకుంది. అయితే, అతనొక అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్త అని సమాచారం. ఇకపోతే, పవిత్రా పునియా.. 'యే హై మొహబ్యతేన్', 'గీత్ హుయీ సబ్పే పరాయి' వంటి ప్రముఖ హిందీ సీరియల్స్తో ప్రేక్షకుల మనసులను దోచేసింది.