పోసాని కృష్ణ మురళికి కరోనా పాజిటివ్‌

పోసాని కృష్ణ మురళికి కరోనా పాజిటివ్‌

తెలుగు సినీ ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఙాశాలికి పేరుపొందిన నటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా సోకింది. దాంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. పోసాని కృష్ణ మురళికి కరోనా సోకడం ఇది మూడోసారి. పూణేలో జరిగిన షూటింగ్‌లో పాల్గొని... ఏప్రిల్ 13న హైదరాబాద్‌కు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా చిత్రసీమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పోసాని. ప్రస్తుతం పోసాని ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్‌టాపిక్‌గా నిలిచే పోసాని కృష్ణమురళి.. వారం రోజుల క్రితం నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నంది పురస్కారలపై అనేక అపోహలున్నాయని.. కులాలు, గ్రూపులుగా అవార్డులు పంచుకున్నారని చెప్పారు. అవి నంది అవార్డులు కాదు కమ్మ అవార్డులని, కమిటీలో ఉన్న 12మంది సభ్యుల్లో 11మంది కమ్మవారే. అలా తనకు వచ్చిన కమ్మ నంది అవార్డును వద్దనుకున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెంపర్‌ సినిమాలో పోసాని నటనకు నంది వరించింది. అయితే ఆ అవార్డును పోసాని తిరస్కరించాడు.