ఏపీ సర్కార్‌‌పై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు

ఏపీ సర్కార్‌‌పై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో థియేటర్ల లొల్లి మరోసారి తెరపైకి వచ్చింది. పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ విడుదలకు ముందు నార్మల్‎గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కొంతకాలం కింద సినిమా థియేటర్లలో టికెట్లు ఆన్ లైన్ లోనే అమ్మాలంటూ జవాబుదారీతనం తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత రావడం, సినీ పెద్దలు సీఎం జగన్‎తో మాట్లాడటంతో సమస్య కొలిక్కివచ్చింది.  కాగా.. తాజాగా భీమ్లా నాయక్ సినిమా విడుదలకు ముందు రోజు.. సినిమా థియేటర్లలో ప్రమాణాలు పాటించాలని, ఐదో షో వేసుకోవడానికి అనుమతులు లేవంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాంతో సమస్య మరోసారి ఉత్పన్నమైంది. 

ఈ విషయంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. భీమ్లా నాయక్ సినిమా పట్ల ఏపీ ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు. సినిమారంగంపై ఆధిపత్య ధోరణి ఏంటని ఆయన ప్రశ్నించారు. మీకు మీకు మధ్యన ఏమైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలని.. బాక్సాఫీసు దగ్గర ఎందుకు అని అడిగారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రేక్షకుల ఆదరాభిమానాలను ఎవరూ ఆపలేరని ప్రకాశ్ రాజ్ అన్నారు.

For More News..

ప్రముఖ సినీనటికి కరోనా పాజిటివ్

ప్లాస్టిక్‎తో కలిగే ప్రమాదం.. కళ్లకు కట్టేట్లు చూపే వీడియో