ఆర్ నారాయణమూర్తికి మాతృవియోగం

ఆర్ నారాయణమూర్తికి మాతృవియోగం

పీపుల్స్ స్టార్, దర్శకనిర్మాత ఆర్ నారాయణమూర్తి  తల్లి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూశారు.  కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో  ఆమె మృతి చెందారు.  ప్రస్తుతం ఆమె వయసు 93 సంవత్సరాలు. చిట్టెమ్మకు మొత్తం ఏడుుగురు సంతానం కాగా అందులో  నారాయణమూర్తి మూడోవాడు. నారాయణ మూర్తి తల్లి మృతి పట్ల పలువు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అతి సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నారాయణ మూర్తి  నటుడు కావలని ఇండస్ట్రీకి వచ్చారు. ఆ తరువాత దర్శకనిర్మాతగా మారి పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.