
హీరో రాజశేఖర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మా ఉపాధ్యక్ష పదవికి అతడు రాజీనామా చేశాడు. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో శివాజీరాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో నరేష్ అధ్యక్షుడిగా, రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.
అయితే కొన్ని రోజులకే మా అసొసియేషన్ లుకలుకలు బయటపడగా..గురువారం జరిగిన డైరీ ఆవిష్కరణలో అవి తారాస్థాయికి చేరాయి. దీంతో మనస్తాపంతో హీరో రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశాడు.