RamCharan: పెద్ది షూటింగ్ నుంచి కర్నాటక సీఎంను కలిసిన రామ్ చరణ్.. అసలు కారణమిదే!

RamCharan: పెద్ది షూటింగ్ నుంచి కర్నాటక సీఎంను కలిసిన రామ్ చరణ్.. అసలు కారణమిదే!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న‘పెద్ది’ మూవీ షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌‌‌‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య.. రామ్ చరణ్‌‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు రామ్ చరణ్ మర్యాద పూర్వకంగా కలుసుకుని సీఎంను శాలువాతో సత్కరించారు. ‘పెద్ది’ సినిమాతో పాటు సినీ పరిశ్రమ గురించి కూడా కొన్ని అంశాలు వీరు చర్చించుకున్నారు

ఈ విషయాన్నీ స్వయంగా సీఎం సిద్దరామయ్య తన X వేదికగా పంచుకున్నారు. 'పెద్ది సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖ తెలుగు సినిమా నటుడు రామ్‌చరణ్ ఈరోజు మైసూర్‌లో నన్ను కలిసి కొద్దిసేపు మాట్లాడారని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం మైసూర్‌‌‌‌లో ‘పెద్ది’ ఓ గ్రాండ్ సాంగ్‌‌ను చిత్రీకరిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో పిక్చరైజ్ అవుతున్న ఈ సాంగ్ కచ్చితంగా ఒక విజువల్ ఫీస్ట్‌‌లా ఉంటుందని మేకర్స్ చెప్పారు.

స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది.  శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.   మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం  మార్చి 27  రామ్ చరణ్   పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.