ఫ్రీగా ‘లా’ ఎడ్యుకేషన్ అందిస్తానంటున్న సోనూ సూద్

V6 Velugu Posted on Aug 03, 2021

ప్రముఖ నటుడు సోనూ సూద్ తన గొప్ప మనసును మరోమారు చాటుకున్నారు. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో వేలాది మంది వలస కూలీలను సొంతూళ్లకు చేర్చడంలో సాయం చేసిన సోనూ.. వందలాది మంది కొవిడ్ పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ అందించడంలోనూ విశేష కృషి చేశారు. దీంతో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో సోనూ తన సేవా కార్యక్రమాలను దేశమంతా విస్తరిస్తూ వస్తున్నారు. ఎవరికి ఏ సాయం కావాలన్నా ఆదుకుంటున్నారు. తాజాగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘లా’ (న్యాయ విద్య) చదవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ డబ్బులు పెట్టి చదివే స్థోమత లేని విద్యార్థులకు ఆసరాగా ఉండాలని నిర్ణయించుకున్నారు. న్యాయ విద్య చదవాలనుకునే వారికి అండగా ఉంటానని సోనూ ప్రకటించారు. ‘లా’ అభ్యసించాలనుకునే ఔత్సాహికులకు సూద్ ఫౌండేషన్ తరఫున ఉచితంగా చదివిస్తానని తెలిపారు. ఫ్రీగా ‘లా’ చదవాలనుకునే వారు soodcharityfoundation.orgలో రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు. 

 

Tagged Aspirants, Free education, Actor Sonu Sood, Sood Charity Foundation, Law Education

Latest Videos

Subscribe Now

More News