బాలీవుడ్ కంటే తెలుగులో యాక్ట్ చేయడమే ఎక్కువ ఇష్టం: సోనుసూద్

బాలీవుడ్ కంటే తెలుగులో యాక్ట్ చేయడమే ఎక్కువ ఇష్టం: సోనుసూద్

హైదరాబాద్: బాలీవుడ్ మూవీస్ కంటే తనకు తెలుగులో యాక్ట్ చేయడమే ఎక్కువ ఇష్టమని ప్రముఖ నటుడు సోనుసూద్ అన్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025, మే 7 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‎లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ, ఏర్పాట్లపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్ ఇండియా నందిని గుప్తా, సోనూ సోద్, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ  మంగళవారం (మే 6)  మీడియా సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా సోనుసూద్ మాట్లాడుతూ.. తాను యాక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ అరుంధతిలోని ఫేమస్ డైలాగ్ ‘వదలా బొమ్మాలి వదలా’తో స్పీచ్ స్టార్ట్ చేశాడు. ఈ ఒక్క డైలాగ్‎తో నన్ను తెలుగువాణ్ణి చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక -మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‎లో జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. మిస్ వరల్డ్ అంటే బ్యూటీ ఒక్కటే కాదని.. ఒక మంచి కాస్ కోసం జరుగుతున్న ఈవెంట్ ఇదని అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‎పై అవేర్నెస్ కల్పించేందుకు కృషి చేస్తున్నామని.. అవసరం ఉన్నవాళ్లకు చేయూత కూడా అందిస్తామని పేర్కొన్నారు. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా మరో నాలుగు రోజుల్లో మిస్ వరల్డ్-2025 అందాల పోటీలు మొదలు కాబోతున్నాయి. 2025, మే 7 నుంచి మే 31 వరకు మిస్ వరల్డ్ 2025 కాంపిటిషన్ జరగనుంది. దీంతో వివిధ దేశాల అందాల భామలు ఒక్కరొక్కరుగా హైదరాబాద్‎కు చేరుకుంటున్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనే అందాల భామల రాకతో హైదరాబాద్‎లో ఇప్పటి నుంచే సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు మిస్ వరల్డ్ 2025 పోటీలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

చాలా తక్కువ రాష్ట్రాలకు మాత్రమే లభించే ఈ అరుదైన మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టేపడేలా స్వాగత ఏర్పాట్లు చేసింది. "ఆల్‌ ఐస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఆర్‌ ఆన్‌ తెలంగాణ’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు మిస్ వరల్డ్ 2025 కిరీట కోసం పోటీ పడనున్నారు. మిస్ వరల్డ్ పోటీలను గ్రాండ్ సక్సెస్ చేసి.. హైదరాబాద్ పేరు ప్రపంచ దేశాల్లో మోరుమోగేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.