
నటుడు శ్రీకాంత్ అయ్యంగార్( Srikanth Iyengar) రివ్యూ రైటర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తాజాగా నటించిన మూవీ బెదురులంక 2012(bedurulanka 2012). యంగ్ హీరో కార్తికేయ గుమ్మికొండ(karthikeya gummikonda) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ బెదురులంక 2012 సినిమా గురించి, హీరో కార్తికేయ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
నేను ఇంతకుముందు చావు కబురు చల్లగా అనే సినిమాలో కార్తికేయతో నటించాను. ఆయన సూపర్ స్టార్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే చూడడానికి బాగుంటాడు. మంచి ఫిజిక్ కూడా ఉంది. క్రమశిక్షణతో పనిచేస్తాడు. అన్నింటినీ మించి అతనొక మంచి నటుడు. బెదురులంక 2012లో అద్భుతమైన నటనను కనబరిచాడు అని చెప్పుకొచ్చాడు.
ఇక రివ్యూ రైటర్ల గురించి మాట్లాడుతూ.. రివ్యూస్, గివ్యూస్ ఎవరైనా రాస్తారులెండి. మనమేమైన పీకుడు పనిచేసి.. సాధించి వేరే వాళ్ళ గురించి రాస్తే ఫర్వాలేదు. మన గురించి ఎవడో ఎవడో ఎదో రాస్తే మనం ఇక్కడ ఎందుకుంటాం? కాంతార సినిమాకు ఒక్క రివ్యూ కూడా రాలేదు. జనాలు దాన్ని సూపర్ హిట్ చేశారు? ప్రేక్షకులకు ఒకరు చెప్పాల్సిన అవసరంలేదు.. వాళ్లకు నచ్చితే థియేటర్లకు వచ్చి మరీ ఆదరిస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు శ్రీకాంత్ అయ్యంగార్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన కామెంట్స్ పై రివ్యూ రైటర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.