నటుడు విజయ్ ఫ్యాన్స్ వాహనాలను ధ్వంసం చేశారు

నటుడు విజయ్ ఫ్యాన్స్ వాహనాలను ధ్వంసం చేశారు

చెన్నై కృష్ణగిరిలో తమిళ నటుడు విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. బిగిల్ చిత్రం ఫ్యాన్స్ షోలు ప్రదర్శించకపోవటంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. అర్ధరాత్రి వాహనాలను ధ్వంసం చేసి, నిప్పు పెట్డి రచ్చరచ్చ చేశారు. కోర్టు కేసులు, ఆరోపణలు, వ్యతిరేకతలను అధిగమించి.. భారీ అంచనాలతో ఇవాళ బిగిల్  సినిమా విడుదలైంది. అయితే దీపావళికి విడుదలవుతున్న చిత్రాలకు ప్రత్యేక ఆటల ప్రదర్శనలకు అనుమతివ్వలేదు ప్రభుత్వం. దీంతో ఫ్యాన్స్ షోలు ప్రదర్శించకపోవటం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. వందలాదిగా రోడ్లపైకి చేరిన అభిమానులు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో తిరుగుతూ ఆందోళన చేశారు. రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. రోడ్లపై వాహనాలకు నిప్పుపెట్టినా పోలీసులు ఎవరూ అటువైపు రాలేదు.