Vishal Supports Trisha: త్రిషపై చీప్ కామెంట్స్..నరకంలో కుళ్ళిపోతారని ఆశిస్తున్నా!

Vishal Supports Trisha: త్రిషపై చీప్ కామెంట్స్..నరకంలో కుళ్ళిపోతారని ఆశిస్తున్నా!

హీరోయిన్ త్రిష (Trisha)పై అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ త్రిష వ్యక్తిగత జీవితంపై ఏవీ రాజు బహిరంగంగా మాట్లాడిన మాటలకు సినీ ఇండస్ట్రీ అంత ఏకం అవుతుంది.అత‌డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా స్టార్ హీరో విశాల్ (Vishal) కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా తన X ఖాతాలో స్పందిస్తూ అన్నాడీఎంకే మాజీ నేతను ఏకిపారేశాడు. 'ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక తెలివితక్కువ ఇడియట్ మా సినీ సోదరుల గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడని నా దృష్టికి వచ్చింది. మీరు పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు కాబట్టి నేను మీ పేరు లేదా మీరు టార్గెట్ చేసిన వ్యక్తి పేరును ప్రస్తావించను. ఎందుకంటే మేము మంచి స్నేహితులమే కాదు..సినిమా సోదరులలో పరస్పర సహ కళాకారులం కూడా. మీ ఇంట్లో ఉన్న స్త్రీలు మీరు చేసిన పని తర్వాత ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. వారికి మనస్సాక్షి ఉంటే.. మీకు లేకపోయినా! అవును...భూమిపై ఉన్న అలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలాంటి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది.

Also Read :త్రిషపై అన్నాడీఎంకే లీడర్ చీప్ కామెంట్స్..ఛీ వింటేనే చిరాకేస్తుంది

మీరు చేసింది పూర్తిగా అసహ్యంగా ఉంది. అది ఏదైనా సరే స్వంత స్వలాభం కోసం బ‌హిరంగంగా ప్రస్తావించదగినది కాదు..నిజాయితీగా చెప్పాలంటే, నాకు నిన్ను ఖండించడం కూడా ఇష్టం లేదు. ఇది తక్కువత‌నం. కానీ మీరు నరకంలో కుళ్ళిపోతారని నేను ఆశిస్తున్నాను. మరొక్కసారి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయాలనే ఉద్దేశ్యం లేదు.. కానీ మానవుడిగా, మీరు భూమిపై ఉన్నంత వరకు (ఎప్పటికీ ఉండలేరు)..అయితే సెలబ్రిటీల గురించి ఇలాంటి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించే ప్రయత్నం ట్రెండ్‌గా మారింది. ఉద్యోగం పొందండి, మంచి ఉద్యోగం పొందండి. కనీసం ప్రాథమిక క్రమశిక్షణ అయినా నేర్చుకోవడానికి మీరు బిచ్చగాడిగా వృత్తిని ప్రారంభించవచ్చు'' అని విశాల్ తనదైన రీతిలో రాసుకొచ్చారు.

ఏవీ రాజు చేసిన సంచలన వ్యాఖ్యలపై త్రిష స్పందిస్తూ..ఛీ వింటేనే చిరాకేస్తుంది..అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. అతడిపై న్యాయ పోరాటం చేస్తానని..ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచే వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు త్రిష ఎక్స్‌ లో పోస్ట్‌ చేసింది. 

ఇటీవల తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన  విషయం తెలిసిందే.