వందల ఫోన్స్.. మెంటల్ టార్చర్.. డ్రగ్స్ కేసుపై స్పందించిన ఆషు రెడ్డి

వందల ఫోన్స్.. మెంటల్ టార్చర్.. డ్రగ్స్ కేసుపై స్పందించిన ఆషు రెడ్డి

నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో తన పేరు వినిపించడం, తన ఫోన్ నెంబర్ ను ఓపెన్ ప్లాట్ఫార్మ్ లో పెట్టడంపై ,మండిపడ్డారు బిగ్ బ్యూటీ ఆషు రెడ్డి. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదన ఇప్పటికే చెప్పినా.. పలు యూట్యూబ్‌ ఛానల్స్ తమ పేర్లను పదేపదే ప్రసారం చేయడంతో ఇబ్బందులకు గురవుతున్నామని తాజాగా మరో వీడియో విడుదల చేశారు ఆషు రెడ్డి . 

ALSO READ: సే నో టూ డ్రగ్స్..

"నేను ఇప్పటికే ఈ డ్రగ్స్‌ కేసుతో సంబంధం లేదని చెప్పాను. కేపీ చౌదరితో గంటలపాటు వందల ఫోన్‌ కాల్స్‌ మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. నా దగ్గర కూడా కాల్‌ డేటా ఉంది. ఈ వార్తల వల్ల గత రెండు రోజుల నుంచి మెంటల్‌గా టార్చర్‌ అనుభవిస్తున్నాను. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతేకాదు.. నా వ్యక్తిగత నంబర్‌ను డిస్‌ప్లే చేశారు. దాంతో కొన్ని వందల ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఏమీ చేయలేక ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాను.

రెండు నెలలుగా షూటింగ్‌ పనిమీద ఇతర దేశాల్లోనే ఉన్నాను. దయచేసి మాకూ కెరియర్‌ ఉందని గమనించండి. ఇకనైన తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆషు రెడ్డి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.