Chandini Chowdary: అయ్యో.. నేను ఆలా అనలేదు.. చాందిని చౌదరిని ఆడేసుకుంటున్న నెటిజన్స్

Chandini Chowdary: అయ్యో.. నేను ఆలా అనలేదు.. చాందిని చౌదరిని ఆడేసుకుంటున్న నెటిజన్స్

ప్రముఖ నటి చాందిని చౌదరి(Chandini Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో మొదలైన ఆమె ప్రయాణం ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవలే ఆమె హీరోయిన్ గా వచ్చిన గామి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఆమె నుండి మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో మ్యూజిక్ షాప్ మూర్తి(Music Shope Murthy) సినిమా ఒకటి. దర్శకుడు శివ పాలడుగు తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ఒక రిపోర్టర్.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా.. మీ ఫెవరేట్ టీమ్ ఏంటి అని అడిగాడు.. దానికి సమాధానంగా చాందిని.. నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడలేదు. ఒకసారి చూసిన తర్వాత ఏది ఫేవరెట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. మాది ఆంధ్ర కాబట్టి మా ఆంధ్రకు కూడా ఒక టీం ఉంటే బాగుండుందని.. తెలిపింది.

 దీంతో ఆమెను నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు.. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ టీమ్ ను ఆమె ఓన్ చేసుకోలేక పోతోందని, ఆమె చేస్తున్న సినిమాలు కేవలం ఆంధ్ర వాళ్ళే చూస్తున్నారా? తెలంగాణ వాళ్ళు చూడడం లేదా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ ట్రోల్స్ తనవరకు చేరడంతో సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు చాందిని.. నా ఫేవరెట్ ఐపిఎల్ టీం ఏది అని అడిగితే.. నేను మ్యాచ్ లు చూశాకే చెబుతా అన్నాను. నాది ఆంధ్ర కాబట్టి ఆంధ్రకి కూడా టీం ఉంటే బాగుండు అన్నాను. ట్రేండింగ్ కంటెంట్ కి తగ్గట్టు వీడియో ఎడిట్ చేయడం మాములే కదా. అయినా.. నేను నా రెండు రాష్ట్రాలను చూసి గర్విస్తా. ఎందుకంటే.. నేను ఈ రెండు రాష్ట్రాలకు చెందిన దాన్ని. హైదరాబాద్ టీమ్ కి ఆల్ ధీ బెస్ట్.. అంటూ రాసుకొచ్చారు చాందిని.