
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వేలాది మంది కరోనా వైరస్ సోకి చనిపోగా…అనేక దేశాల్లో వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లేటెస్టుగా కరోనా వైరస్ ఇండియాకు వచ్చింది. రెండు కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఒక కేసు ఢిల్లీలో నమోదు కాగా..మరో కేసు హైదరాబాద్ లో నమోదైంది. దీంతో ప్రజల్లో భయం వ్యక్తమవుతోంది. భయాందోళనలో జనం ఉంటే సినీ నటి చార్మీకి మాత్రం సెటైర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు, ఢిల్లీ, తెలంగాణకు కరోనా వచ్చేసిందట.. నేను ఇప్పుడే వార్తల్లో చూసాను అల్ డి బెస్ట్ అంటూ వెటకారంగా నవ్వుతున్న ఓ వీడియోను టిక్ టాక్ లో పోస్టు చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…జనం చార్మీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.