సితార బ్యానర్‌‌‌‌లో నేహాశెట్టి

సితార బ్యానర్‌‌‌‌లో నేహాశెట్టి

‘డీజే టిల్లు’లో రాధికగా ఫేమస్ అయిన నేహాశెట్టి ప్రస్తుతం వరుస యంగ్ హీరోస్‌‌తో జోడీ కడుతోంది. ఇప్పటికే సందీప్ కిషన్‌‌తో ‘గల్లీ రౌడీ’లో నటించింది. కార్తికేయతో కలిసి త్వరలో ‘బెదురులంక’లో కనిపించనుంది. నవీన్‌‌ పొలిశెట్టికి జంటగా ‘అనగనగ ఒక రాజు’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా మరో యంగ్ హీరో సరసన సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది.

సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ సంస్థలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నేహాశెట్టిని హీరోయిన్‌‌గా ఫిక్స్ చేశారట. డీజే టిల్లు, అనగనగ ఒక రాజు చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి నేహాశెట్టి సితార బ్యానర్‌‌‌‌లో నటిస్తోందని తెలుస్తోంది. ఇందులో అంజలి కూడా మరో హీరోయిన్‌‌గా కనిపించనుందని సమాచారం. కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే సెట్స్‌‌కి వెళ్లనుంది.