తనను తాను పెళ్లాడిన టీవీ నటి

తనను తాను పెళ్లాడిన టీవీ నటి

తనను తానే పెళ్లి చేసుకున్నట్టు ప్రముఖ టీవీ నటి కనిష్కా సోనీ ప్రకటించింది. కనిష్కా ఆగష్టు 6న ఇన్‌స్టాగ్రామ్‌లో నుదుటన సింధూరం, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దీనిపైన అభిమానులు ఆమెను ఆరా తీయగా అసలు విషయాన్ని బయటపెట్టింది.  'నా కలలన్నింటినీ నాకు నేనుగా సొంతంగా సాధించుకున్నాను. నేను ప్రేమిస్తున్నా ఏకైక వ్యక్తిని నేనే. అందుకే నన్ను నేను వివాహం చేసుకున్నాను' అంటూ కనిష్కా తన పోస్ట్ లో వివరించింది. ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు ఆమెను ద్వేషిస్తూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో కనిష్కా ఓ వీడియోను పోస్ట్ చేసింది. 

''చాలా మంది నా లైంగిక జీవితం గురించి ప్రశ్నించారు. వారందరికి నేను నిజాయితీగా నేను చెప్పేది ఒక్కటే. నేను గుజరాత్‌కు చెందిన చాలా సాంప్రదాయమైన కుటుంబానికి చెందిన యువతిని. పెళ్లి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో మంచి అనుభూతి ఉండేది. కానీ మాటలకు విలువ ఇచ్చి కట్టుబడి ఉండే వ్యక్తి నా జీవితంలో నాకు కనపడలేదు. అబ్బాయిలు తమ మాటలకు కట్టుబడి ఉండరని నాకు అర్థమైంది" అని పేర్కొంది.  

తనకి ఏ మగాడు  అవసరం లేదన్న  కనిష్కా .. పెళ్లంటే కేవలం శృంగారం మాత్రమే కాదని, ప్రేమ, నిజాయితీకి సంబంధించిందని తెలిపింది. తన  కలలు, అవసరాలు తాను స్వేచ్ఛగా నేరవేర్చుకోగలనని వెల్లడించింది.  ‘దియా ఔర్‌ బాతి హమ్‌’ టీవీ షోతో ఫుల్ పాపులరైన కనిష్కా... ప్రస్తుతం హాలీవుడ్‌ పైన దృష్టి పెట్టింది.