
ఆదిపురుష్(Adipurush) సినిమాలో ప్రభాస్(Prabhas) అసలు రాముడిలా కనిపించడంలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నటి కస్తూరి(Kasthuri). ఇటీవల తిరుమలలో హీరోయిన్ కృతీ సనన్(Kriti sanon)ను దర్శకుడు ఓం రౌత్(Om Raut) హత్తుకుని, బుగ్గపై ముద్దుపెట్టడం వివాదాస్పదం అయినా సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయం స్పందించిన నటి కస్తూరి..‘ఆదిపురుష్’ సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది.
"సినిమాలో ప్రభాస్ లుక్ చూస్తుంటే కర్ణుడు గుర్తుకువస్తున్నారని చెప్పుకొచ్చింది. శ్రీరాముడితో పాటు లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటని ప్రశ్నించింది. టాలీవుడ్‌లో ఎంతోమంది నటులు శ్రీరాముడి పాత్రల్లో తెరపై అద్భుతంగా కనిపించారు. కానీ, ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడిగా సెట్ అవలేదు అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం కస్తూరి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేదా అనేది చూడాలి.