Lakshmi Pramod: ఇదెక్కడి మాస్రా మావా.. డాన్స్ చేస్తూ డెలివరీకి వెళ్లిన నటి

Lakshmi Pramod: ఇదెక్కడి మాస్రా మావా.. డాన్స్ చేస్తూ డెలివరీకి వెళ్లిన నటి

ప్రెగ్నెన్సీ అంటే చాలా జగ్రత్తగా ఉంటారు ఆడవాళ్లు. ఎక్కువగా నడవడం, పరిగెత్తడం వంటివి అస్సలు చేయరు. ఇంకా డెలివరీ టైంలో అయితే ఆ జాగ్రత్తలు ఇంకా ఎక్కువవుతాయి. కానీ, ఓ నటి మాత్రం డెలివరీకి డాన్స్ చేస్తూ వెళ్లారు. ఎలాంటి నొప్పి, బాధ లేకుండా నవ్వుతూ, డాన్స్ చేస్తూ హాయిగా డెలివరీకి వెళ్లారు ఆమె. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకీ ఆ నటి ఎవరో కాదు లక్ష్మి ప్రమోద్‌. మలయాళ టీవీ ఇండస్ట్రీకి చెందిన ఆమె చాలా సీరియల్స్ నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె మంచి మంచి డాన్సర్ కూడా. తన డాన్స్ రీల్స్ కూడా చాలానే వైరల్ అయ్యాయి. అలానే డెలివరీ కోసం లేజర్ రూమ్ కు వెళ్తున్న సమయంలో కూడా ఒక రీల్ చేద్దామా అని తన భర్తను అడిగారట లక్ష్మి. అందుకు తన భర్త అజర్‌ మహ్మద్‌ ఒకే చెప్పారట. వెంటనే తన ఫోన్ తీసి ఆ డాన్స్ వీడియోను రికార్డు చేశాడట. 

అనంతరం ఆ వీడేమోను తన ఇన్స్టాలో షేర్ చేశారు లక్ష్మి ప్రమోద్. దీంతో ఆ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆ నటి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.