యాదాద్రి జిల్లాలో 3 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచులక్ష్మి

యాదాద్రి జిల్లాలో 3 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచులక్ష్మి

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని మూడు పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు సినీ నటి మంచు లక్ష్మి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తో సమావేశం అయ్యారు. సంబంధిత శాఖ అధికారులతో చర్చించిన తర్వాత ఆలేరు మండలం పటేల్ గూడెంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు మంచు లక్ష్మి. సీఎం కేసీఆర్ ప్రకటించిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు మంచు లక్ష్మి. పాఠశాలను అభివృద్ధి చేసి పిల్లలకు సరైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నానన్నారు. ప్రతి విద్యార్థికి సరైన విద్య అందాలనేదే  లక్ష్యం అన్నారు. చదువు అంటే ప్రభుత్వ స్కూళ్లే గుర్తుకు రావాలన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాభ్యాసానికై ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సారించేలా చేయడమే సంకల్పం అని మంచు లక్ష్మి పేర్కొన్నారు. 

 

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నమంచు లక్ష్మి
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సినీనటి మంచు లక్ష్మి. జిల్లాలో మూడు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు వచ్చిన ఆమె స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రావణమాసంలో ఆలయంలో నిర్వహించే 'కోటి కుంకుమార్చన' టికెట్ ను ఆమె కొనుగోలు చేశారు.